Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆఫ్ఘనిస్థాన్ ను ఆలౌట్ చేయలేకపోయిన పాకిస్థాన్.. స్కోరు 227 పరుగులు

  • ఓవర్లన్నీ ఆడిన ఆఫ్ఘనిస్థాన్
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు చేసిన ఆఫ్ఘన్ జట్టు
  • రాణించిన అస్గర్, నజీబుల్లా
లీడ్స్ లో పాకిస్థాన్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్ లో భీకర బౌలింగ్ వనరులున్న జట్లలో పాకిస్థాన్ కూడా ఒకటి. ఇతర జట్లకు భిన్నంగా ఆ జట్టు ఎప్పుడూ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగుతుంది. అలాంటి పాక్ కూడా ఆఫ్ఘన్లను ఆలౌట్ చేయలేకపోయింది. నిప్పులు చెరిగే బంతులతో పాక్ పేసర్లు విరుచుకుపడుతున్నా ఆఫ్ఘన్ జట్టు నిబ్బరంగా కాచుకుంది.

అయితే అనుభవలేమి కారణంగా భారీస్కోరు నమోదుచేయలేకపోయినా, ఓవర్లన్నీ ఆడాలన్న పట్టుదల మాత్రం ఆఫ్ఘన్లలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్, నజీబుల్లా జాద్రాన్ చెరో 42 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది 4, వహాబ్ రియాజ్ 2, ఇమాద్ వాసిం 2 వికెట్లు తీశారు.
Afghanistan
Pakistan
World Cup

More Telugu News